హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేత హరీష్రావు. సమాధానం చెప్పలేకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. సర్టిఫికెట్లు అందక ఉద్యోగ, విదేశీ విద్య అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
=======================